Nalgonda : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్గొండ జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.

Nalgonda : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

Nalgonda

Updated On : October 24, 2021 / 10:31 AM IST

Nalgonda :  నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుముల మండలంలోని తెట్టెకుంట గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు (21), సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజులక్రితం గ్రామానికి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

చదవండి : Love : పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

వీరిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇద్దరు మృతి చెందారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమికుల మృతితో తెట్టెకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చదవండి : Love : ప్రేమ వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు