సనాతన ధర్మం కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి మాధవీలత పనిచేస్తారా? తేల్చిచెప్పిన మాధవీలత
దీని గురించి మాధవీలత 10టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ పేరుతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో ఈ తరహా కార్యక్రమాలను బీజేపీ తెలంగాణ నాయకురాలు మాధవీలత కూడా కొనసాగించారు.
దీని గురించి మాధవీలత 10టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మేమిద్దరం కలిసి ఏమీ పని చేయట్లేదు.. ఆయన పనులు ఆయన చేస్తున్నారు. నా పనులు నేను చేస్తున్నాను. భగవంతుడుగనుక సమయము ఇస్తే, పవన్ కల్యాణ్‌గాని, ఆయన పార్టీగాని ఏ రోజైనా నాకు వాళ్లతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఇస్తే.. చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
అంతేగాక, అటువంటి అవకాశం వస్తే నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే కలిసి పని చేయడం వల్ల శక్తి పెరుగుతుంది గానీ, తరగదు. ఎక్కడ మంచి కార్యక్రమం జరిగినా ఆ మంచి కార్యక్రమానికి నాదంటూ ఒక చిన్న భాగస్వామ్యాన్ని నేను ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. నన్ను పిలిచే వాళ్లు వేర్వేరు సంఘాల వారు.
నేను ఆయనని ఇన్వేట్ చేసేంత కెపాసిటీ నాకు లేదు ఓపెన్ గా చెబుతున్నాను. కానీ, ఒకవేళ పవన్ నన్ను పిలిస్తే వెళ్తాను. నన్ను ఇక్కడికి రమ్మేంటే నిరభ్యంతరంగా నేను వెళ్తాను. పిలిస్తే వెళ్తాను.. ఎవరైనా ఆహ్వానిస్తేనే కదా వెళ్లేది? ఇప్పుడు మా దగ్గర (తెలంగాణలో) కూడా సమస్యలు బాగానే ఉన్నాయి” అని అన్నారు.