Wife killed Husband : భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన భార్య

పొలం అమ్మేస్తానని అంటున్నాడని కొడుకు..తన బంధువులతో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. తరువాత మృతదేహాన్ని కొత్తగా కట్టుకుంటున్న ఇంటి బాత్రూమ్ లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది.

Wife killed Husband : భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన భార్య

Women Killed Her Husband Buried Him In The Bathroom

Updated On : September 2, 2021 / 3:20 PM IST

women killed her husband buried him in the bathroom : డబ్బుల కోసం కన్నవారినే అంతమొందిచే ఘటనలు..కన్నవారే బిడ్డలను చంపివేసే దారుణాలు జరుగుతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఓ మహా తత్వవేత్త చెప్పిన మాటలు ఈ రోజుల్లో నిజమేననిపిచే దారుణాలు జరుగుతున్నాయి. అటువంటిదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. డబ్బుల కోసం ఏకంగా ఓ భార్య కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా చంపి బాత్రూమ్ లో పాతిపెట్టేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా నా భర్త కనిపించట్లేదు సార్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా రెండు నెలలు గడిచిపోయాయి. కానీ సదరు భర్త ఆచూకీ పోలీసులకు లభించలేదు. ఈక్రమంలో సదరు భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేయగా భార్య భర్తను చంపింనట్లుగా రుజువైంది.

ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య రాములమ్మ దంపతులు. వారికి రెండు ఎకరాలు పొలం ఉంది. ఆ రెండు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉంది.ఈక్రమంలో తన భర్త చెన్నయ్య కనిపించకుండా పోయాడంటూ రాములమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు చెన్నయ్య కోసం గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈక్రమంలో చెన్నయ్య అక్కలు ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మలు వదిన రాములమ్మపై అనుమానంతో ఆమెను నిలదీశారు. మా తమ్ముడు కనిపించట్లేదు ఏం చేశావంటూ నిలదీశారు. కానీ రాములమ్మ తెలివిగా ‘మీ తమ్ముడిపై మీకు ప్రేమ ఉన్నట్లే నా భర్తపై నాకు లేదా?అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.

కానీ రాములమ్మ మాటల్ని చెన్నయ్య అక్కలు నమ్మలేదు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చెన్నమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. రాములమ్మమీదే తమకు అనుమానంగా ఉందని తెలిపారు. దీంతో పోలీసులు రాములమ్మను గట్టిగా తమదైన శైలిలో ప్రశ్నించగా..భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. మిగిలిన ఎకరం పొలాన్ని కూడా అమ్ముతానని చెన్నయ్య గొడవ చేస్తున్నాడనీ..అందుకే చంపానని చెప్పింది.కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు రాములమ్మ చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంటి బాత్​రూంలో శవాన్ని పాతిపెట్టామని తెలిపింది. దీంతో పోలీసులే షాక్ అయ్యారు.

పాతిపెట్టిన స్థలాన్ని చూపించమని రాములమ్మను అడగ్గా బాత్​రూంతో పాటు మరో రెండు చోల్ చూపిస్తూ పోలీసులకు చికాకు తెప్పింది. దీంతో పోలీసులు మరోసారి తమదైన శైలిలో థమ్కీ ఇవ్వగా బాత్రూమ్ లో పాతిపెట్టానని చూపించింది. దీంతో పోలీసులు తహసీల్దార్​ సమక్షంలో తవ్వి డెడ్​బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా..భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన విషయం తెలుసుకున్న స్థానికులు మతదేహాన్ని తవ్వే ప్రాంతానికి భారీగా తరలివచ్చారు.వింతగా చూశారు.