Alleti Maheshwar Reddy: కమలం గూటికి అల్లేటి.. బీజేపీ కండువా కప్పిన జేపీ నడ్డా
అనుకున్నదే అయింది. అల్లేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు.

Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ పార్టీకి అల్లేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా అల్లేటి కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. అనంతరం ఢిల్లీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం జేపీ నడ్డా మహేశ్వర్ రెడ్డికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
Maheshwar Reddy: కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

జేపీ నడ్డాతో అల్లేటి మహేశ్వర్ రెడ్డి
అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ఏనాడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయలేదని, తనకు కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ ఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. పార్టీలో ఇమడలేనని అర్థమైందని, అందుకే రాజీనామా చేశానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. బీజేపీ నేతలతో మహేశ్వర్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారంటూ నోటీసులో తెలిపింది. దీనిపై గంటలోపే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Telangana Congress : పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ..

జేపీ నడ్డాతో మహేశ్వర్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు
ఈ నోటీసులపై స్పందించిన మహేశ్వర్ రెడ్డి.. తనకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఈ అంశంపై త్వరలో ఖర్గేను కలిసి తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటానని మహేశ్వర్ రెడ్డి నిన్న వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లడం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, బీజేపీలో చేరడం జరిగిపోయాయి.