Hyderabad : ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.

Hyderabad : ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

Hyderabad (2)

Updated On : November 11, 2021 / 8:44 AM IST

Hyderabad : హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వేగంగా వెళ్లిన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి : Bus Accident: నడిరోడ్డుపై బస్సు దగ్ధం.. 12మంది సజీవ దహనం

బహదూర్ పురా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహెల్, పైసల్‌లు బుధవారం ఉదయం స్నేహితుడు ఖాన్ ను సిటీబస్సు వద్ద వదిలి తిరిగి వస్తుండగా పొగమంచు కారణంగా రోడ్డు రోడ్డు కనిపించకపోవడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చదవండి : Fire Accident: కమలానెహ్రూ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం