Makkan Singh Raj Thakur: ఎన్టీపీసీ వర్సెస్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌.. ఏం జరుగుతోంది?

ఎమ్మెల్యే ఎన్టీపీసీని టార్గెట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చినట్లుగానే చేస్తుందట గాని.. అసలు డిమాండ్‌ను నెరవేర్చడం లేదట.

Makkan Singh Raj Thakur: ఎన్టీపీసీ వర్సెస్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌.. ఏం జరుగుతోంది?

Updated On : January 30, 2025 / 8:04 PM IST

చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధుల మధ్య, అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతుంది. కానీ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌ ప్రత్యర్థి ఎన్టీపీసీ యాజమాన్యం అయ్యిందట. CSR ఫండ్స్‌ కోసం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రఫ్ ఆడిస్తున్నారట. అభివృద్ధికి సహకరిస్తారా.? లేదా.?

ఓపెన్‌గా చెప్పాలంటూ ఎమ్మెల్యే సవాల్ చేస్తుండటం రామగుండంలో హట్ టాపిక్‌గా మారింది. NTPC ప్రభావిత గ్రామాల పక్షాన ఎమ్మెల్యే నిలబడటంతో..ఆయా గ్రామాల వైపు వెళ్లాలంటేనే అధికారులు ఆలోచిస్తున్నారట. అయితే ఎమ్మెల్యే ఆగ్రహనికి ఓ లెక్కుందంటున్నారు మక్కాన్ సింగ్ వర్గీయులు. 2వేల 600 మెగావాట్ల సామర్థ్యమున్న రామగుండం ఎన్టీపీసీ రోజురోజుకు విస్తరిస్తుంది.

కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తితో కోట్ల రూపాయల లాభాలను ఆర్జీస్తుంది సంస్థ. అయితే ఎన్టీపీసీ యాజమాన్యం కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ కింద కేటాయించాల్పిన నిధుల విషయంపైనే ఇప్పుడు రచ్చ నడుస్తోంది. CSR నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌.

విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!

స్థానికంగా అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను..పలుకుబడి ఉన్న నేతల నియోజకవర్గాలైన హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, హుజురాబాద్‌కు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రామగుండం అభివృద్ధికి ఎన్టీపీసీ CSR నిధుల కేటాయింపు సక్రమంగా జరిగితే.. నియోజకవర్గ రూపు రేఖలు మారిపోతాయనేది ఎమ్మెల్యే వాదన. ఎన్టీపీసీ సృష్టిస్తున్న కాలుష్యాన్ని భరిస్తూ జీవనం సాగిస్తున్న ప్రజలకు ఎన్టీనీసీ చేసిందేంటి అంటూ మండిపడుతున్నారు లోకల్ ఎమ్మెల్యే.

ఎన్టీపీసీ దిగిరావడానికి ఎమ్మెల్యే పెడుతున్నా మంటతో…అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. ప్రభావిత గ్రామాల్లో మౌళిక వసతులు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను ఎన్టీపీసీ మరిచిపోయిందంటున్నారు ఎమ్మెల్యే. ఎన్టీపీసీ విడుదల చేసే బూడిదతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట.

ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రభావిత గ్రామాల సమస్యలు, నిధుల కేటాయింపుపై ప్రశ్నిస్తే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు తానేంటో.? తన పొలిటికల్ పవరేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారట మక్కాన్‌ సింగ్‌. అభివృధ్దికి సహకరించని మీకు మా భూములెందుకు ఇవ్వాలంటూనే..నడి ఊర్లో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్‌ను బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ పబ్లిక్ హియరింగ్‌లో ఎన్టీపీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మక్కాన్ సింగ్‌.

ఎమ్మెల్యే ఎన్టీపీసీని టార్గెట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చినట్లుగానే చేస్తుందట గాని..అసలు డిమాండ్‌ను నెరవేర్చడం లేదట. ఎమ్మెల్యేకు భయపడుతున్న అధికారులు..పార్టీ పెద్దల దగ్గరకు సమస్య తీసుకెళ్తే..లోకల్ ఎమ్మెల్యేతోనే మాట్లాడుకోండి అంటు సలహలిస్తున్నారే తప్ప ఇన్వాల్వ్ కావడం లేదట. నియోజకవర్గ ప్రజల కోసమే మక్కాన్‌సింగ్ వార్నింగ్‌ ఇస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఈ CSR నిధుల కేటాయింపు వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి మరి.