Mallu Ravi: వాటికి సవరణలు చేసి దాన్నే బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటున్నారు: మల్లు రవి
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.

Mallu Ravi
Mallu Ravi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మరని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, గ్యారంటీలను ముందు పెట్టుకుని, వాటికి సవరణలు చేసి దాన్నే కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటున్నారని చెప్పారు.
కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో అన్ని వర్గాలు మోసపోయాయని, మళ్లీ కొత్తగా కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరిగిందని, జనాల్లో తమపై నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని అన్నారు.
తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని చెప్పారు. కాగా, మల్లు రవి మీడియా సమావేశాన్ని ముస్లిం మైనారిటీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ టికెట్లపై వారు నిరసన తెలిపారు. బహదూర్ పుర, చంద్రాయన్ గుట్ట, యాకత్ పుర, మలక్ పేట టికెట్ల కేటాయింపు సరైన పద్ధతిలో జరగలేదని చెప్పారు.