కరీంనగర్ కు ఇండోనేషియా బృందాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పట్టివేత

  • Published By: madhu ,Published On : March 22, 2020 / 07:15 AM IST
కరీంనగర్ కు ఇండోనేషియా బృందాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పట్టివేత

Updated On : March 22, 2020 / 7:15 AM IST

కరీంనగర్ జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాగం అలర్ట్ అయ్యింది. వీరు తిరిగిన ప్రాంతాలను జల్లెడ పట్టారు. పూర్తిగా శానిటేషన్ నిర్వహించారు.

వేలాది మందికి  టెస్టులు నిర్వహించారు. వీరిలో ఎవరికీ వైరస్ లక్షణాలు కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే…వీరు ఇండోనేషియాకు ఎలా వచ్చారు ? ఎవరైనా పిలిపించారా ? అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. 

కరీంనగర్ నివాసి జలీల్ వీరిని తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ పై దాడులు చేశారు. ఈ విషయం బయటపడడంతో జలీల్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతనికి కూడా కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు.

వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు మాత్రం నిర్ధారించలేదు. ఇక్కడనే పోలీసులు విచారిస్తున్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కేవలం మత ప్రచారం కోసం వచ్చారా ? లేక ఇతర పని మీద వచ్చారా ? అనే కోణంలో విచారిస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా జలీల్ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనుంచితే…జలీల్ కు కరోనా సోకిందా ? లేదా ? అనేది రిపోర్టులు వస్తే కానీ తెలియదు.