Live Suicide : అంతా చూస్తుండగానే.. రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందు జరిగిన ఘోరం ప్రయాణికులను భయపెట్టింది. రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్

Live Suicide : అంతా చూస్తుండగానే.. రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య

Live Suicide

Updated On : November 21, 2021 / 8:13 PM IST

Live Suicide : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందు జరిగిన ఘోరం ప్రయాణికులను భయపెట్టింది. రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా పట్టాలపై నడుచుకుంటూ వెళ్లి రైలుకి ఎదురుగా నిల్చున్నాడు.

WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!

ఇది గమనించిన తోటి ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. కేకలు వేయడం మొదలు పెట్టారు. అలా చేయొద్దని అతడిని వారించారు. అయినా అతడు పట్టించుకోలేదు. ఇంతలో రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు అతడిని ఢీకొట్టి ముందుకెళ్లింది. ఈ ఘటనలో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. ఆ వ్యక్తి పట్టాలపై నడుచుకుంటూ ట్రైన్ కి ఎదురెళ్లడం, ట్రైన్ వచ్చి ఢీకొట్టడం.. అక్కడే ఉన్న ప్రయాణికుడు ఒకరు దీన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

మృతుడిని ఒడిశాకు చెందిన సంజయ్ కుమార్ బెహ్రాగా(28) పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంజయ్ కుమార్ సికింద్రాబాద్ లోని హార్డ్ వేర్ షాప్ లో పని చేస్తున్న‌ట్లు తెలిసింది. తన తాతకు చెప్పి బయటికి వచ్చిన అతడు రామగుండంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. సంజయ్ మానసిక పరిస్థితి బాగోలేదని అతడి బంధువులు తెలిపారు.