Road Accident One Died : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్ర గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.

Secunderabad Road Accident
RTC Bus Hit – Man Killed : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్ర గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.
మరోవైపు నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. మెహిదీపట్నం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. పిల్లర్ నెంబర్ 294 వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.
Plane Crash : పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి
అనంతరం శంషాబాద్ వైపు నుండి మెహిదీపట్నం వెళ్తున్న డిజైర్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.