విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నా కోచ్‌ను బెదిరించారు.. భయంతో జీవిస్తున్నాం: మంచు మనోజ్

పోలీసుల హెచ్చరికలను విష్ణు పట్టించుకోవడం లేదని తెలిపారు.

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నా కోచ్‌ను బెదిరించారు.. భయంతో జీవిస్తున్నాం: మంచు మనోజ్

Updated On : December 15, 2024 / 7:44 PM IST

సినీనటుడు మంచు మనోజ్‌ హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ వివరాలు తెలిపారు. విష్ణు అనుచరులు తన వద్ద పనిచేసే వారిని తన వద్ద లేకుండా చేశారని అన్నారు.

విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని తన కోచ్‌ను బెదిరించారని మనోజ్ తెలిపారు. తాను, తన కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తున్నామని అన్నారు. బౌన్సర్లతో కలిసి విష్ణు తన రూములోకి ప్రవేశించారని మనోజ్ అన్నారు. తన రూములోని ప్రధాన జనరేటర్లలో చక్కెర పోశారని తెలిపారు. అర్ధరాత్రి జనరేటర్లు పనిచేయలేదని అన్నారు.

అగ్నిప్రమాదం లేదా పేలుడు సంభవిస్తే పరిస్థితి ఏంటి ? అని మనోజ్ అన్నారు. విష్ణు, ఆయన బృందం తమ సిబ్బందిని బలవంతంగా తొలగించారని తెలిపారు. తమ విషయంలో జోక్యం చేసుకుంటే హాని కలిగిస్తామని సిబ్బందిని హెచ్చరించారని అన్నారు. విష్ణు తన పట్ల ఎంత శత్రుత్వంతో ఉన్నారో అర్థమవుతోందని మంచు మనోజ్ అన్నారు. పోలీసుల హెచ్చరికలను విష్ణు పట్టించుకోవడం లేదని తెలిపారు.

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ మళ్లీ ఫిర్యాదు