Manchu Manoj Second Marriage : మంచు మనోజ్ రెండో పెళ్లి? భూమా మౌనికతో వివాహంపై ఏమన్నారంటే..
భూమా మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ నో కామెంట్ అన్నారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతాను అన్నారు.

Manchu Manoj Second Marriage : నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడా? భూమి మౌనికను రెండో పెళ్లి చేసుకోనున్నాడా? మంచు మనోజ్, భూమా మౌనిక ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని గణేశ్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వీరిద్దరూ పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే టాక్ మొదలైంది. అయితే, భూమా మౌనికతో పెళ్లిపై మంచు మనోజ్ నో కామెంట్ అన్నారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతాను అన్నారు.
‘మీరూ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?’ అని మీడియా ప్రతినిధి అడగ్గా.. అది వ్యక్తిగత విషయమని, సందర్భం వస్తే తప్పకుండా చెబుతానని మనోజ్ బదులిచ్చారు. సినిమా అప్‌డేట్స్, రాజకీయంలోకి వచ్చే అవకాశాల గురించి ప్రశ్నించగా ‘ప్రస్తుతం వినాయకుడి గురించి మాట్లాడుకుందాం’ అని అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రణతీ రెడ్డిని 2015లో మనోజ్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.