Barse Deva: తెలంగాణ పోలీసుల అదుపులో హిడ్మా సోదరుడు..!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవాపై 50 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Barse Deva Representative Image (Image Credit To Original Source)
- పోలీసుల అదుపులో బర్సె దేవా
- కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్
- బర్సె దేవాపై రూ.50లక్షల రివార్డ్
Barse Deva: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్ కౌంటర్లలో పలువురు కీలక మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మరికొందరు పోలీసులు ముందు లొంగిపోయారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా హిడ్మా సోదరుడు బర్సె దేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బర్సె దేవా అలియాస్ సుక్కా మాయిస్టు అగ్రనేత. ఆయనతో పాటు 15 మంది మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవాపై 50 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బర్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా దేవాలది ఒకే ఊరు. ఇళ్లు కూడా పక్కపక్కనే. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్‌జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్‌తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న.
కాగా, మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్రం పెట్టుకుంది. ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా నిర్వహించిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం, ఎన్‌కౌంటర్‌లలో మరణించడం తదితర పరిస్థితులు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి.
Also Read: మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?
