Protect From Corona : కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే..

కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్  శ్రీరామరక్ష. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే.

Protect From Corona : కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే..

Mask Social Distance Protect From The Corona

Updated On : May 9, 2021 / 9:32 PM IST

protect from the corona : కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్  శ్రీరామరక్ష. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే. చికిత్స కన్నా నివారణ మేలు.. అన్న మాట సరిగ్గా సరిపోతుంది. మందు లేని మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షణగా నిలుస్తాయి. అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్క్ ధరించడం, మరి ముఖ్యంగా 6 అడుగుల భౌతిక దూరం పాటించడం..అన్ని సరే కానీ 6 అడుగుల భౌతిక దూరం కరోనాను నిలువరించలేదని సైంటిస్టులు బాంబు పేల్చారు.

మరి ఇద్దరి వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఎంత ఉండాలి? అసలు సోషల్ డిస్టెన్స్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చా? యూఎస్ లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ ఏం చెబుతుంది. కరోనా సోకిన వ్యక్తి 6 అడుగుల దూరం ఉన్నప్పటికీ గాల్లో వైరస్ పీల్చుకునే అవకాశం ఉంటుందని యూఎస్ లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

గతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య 6 అడుగుల దూరం ఉన్నప్పుడు ఇద్దరూ మాస్కులు ధరిస్తే వైరస్ వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే వైరస్ సోకిన వ్యక్తి 30 రోజుల్లో 406 మందిని కరోనా ఖాతాలో చేర్చడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. సోషల్ డిస్టెన్స్ 70 శాతం పాటిస్తే కరోనా బాధితుడు ద్వారా 30 రోజుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే వైరస్ సోకినట్లు గుర్తించబడింది.

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడిన సమయంలోనూ నోటి నుంచి దాదాపు వేల బిందువులు సెకన్ కు దాదాపు వంద మీటర్ల వ్యాప్తి చెందుతాయి. సూక్ష్మకణాలు వైరస్ ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో కొన్ని గంటలపాటు గాలిలోనే ఉండగలవనే విషయాన్ని సీడీసీ వెల్లడించింది.

చల్లని వాతావరణంలో వైరస్ కణాలు 6 అడుగులే కాకుండా 6 మీటర్లు వరకు వ్యాపిస్తాయట. ఇంటి బయటే కాదు..ఇంటి లోపల కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సీడీసీ చెబుతోంది. అంతేకాదు పాఠశాల తరగతి గదిలో మూడు అడుగుల సామాజిక దూరాన్ని సవరించాల్సివుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ సూచిస్తుంది.