Land Grab : రంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీ భూకబ్జా..!

కబ్జాదారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని మెడ పట్టి గెంటేస్తున్నారు. పేపర్లు పట్టుకెళితే వాటిని చించేస్తున్నారు.

Land Grab : రంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీ భూకబ్జా..!

Updated On : February 16, 2025 / 9:41 PM IST

Land Grab : రంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీ భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 142 ఎకరాల్లోని 1320 ప్లాట్లు కబ్జా చేశారని కొనుగోలుదారులు ఆరోపించారు. మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 40 ఏళ్ల క్రితం ప్లాట్లను కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. రికార్డుల్లోనూ తమ పేరే ఉందన్నారు. కానీ, తమ భూములను నాదెళ్ల ఎస్టేట్ పేరుతో కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. తమ ప్లాట్లలోకి రానివ్వకుండా కబ్జాదారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : హరీశ్ రావు కీలక నిర్ణయం.. పాదయాత్రకు ప్లాన్.. ఎందుకీ పాదయాత్ర, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు..

”1983లో 142 ఎకరాలు 28 మంది రైతుల నుంచి 38 ఈ సర్టిఫికెట్స్ తో వచ్చిన ల్యాండ్ ని 1321 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాయి. 2002 వరకు అంతా నార్మల్. ఆ తర్వాత కబ్జా చేసేశారు. 1983లో కొన్నాం. 142 ఎకరాల్లో 1321 ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. సంగారెడ్డి రామచంద్రపురం మండలం కంది రిజిస్ట్రేషన్ హౌస్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయి.

2002 వరకు అంతా బానే ఉంది. 2002లో మాకు భూములు అమ్మిన వారి నుంచి మళ్లీ ఎకరాలు లెక్కన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 87 కేసులు నమోదయ్యాయి. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. కబ్జాదారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని మెడ పట్టి గెంటేస్తున్నారు. పేపర్లు పట్టుకెళితే వాటిని చించేస్తున్నారు. ఈ రోజు కూడా ఈసీ తీస్తే మా పేర్లే ఉంటాయి. వాళ్ల పేరు మీద ఏ డాక్యుమెంట్ లేదు. బౌన్సర్లని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు” అని బాధితులు వాపోయారు.