తెలంగాణలో కరోనా కేసులు

COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే ఉంది. నిత్యం 5 వేల పైగా పాజిటివ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2 వేల లోపున రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1,896 కేసులు నమోదయితే..2,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,06,644 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించారు. ఇప్పటి వరకు 1201 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 28,368 గా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. తెలంగాణాలో ఇప్పటి వరకు 1,79,075మంది కోలుకున్నారు. రికవరీ రేటు 86.65% శాతంగా ఉంది. మరణాలు 0.58 శాతంగా ఉంది. 50,367పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 33,96,839పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 38. భద్రాద్రి కొత్తగూడెం 82. జీహెచ్ఎంసీ 294. జగిత్యాల 25. జనగామ 24. జయశంకర్ భూపాలపల్లి 15. జోగులాంబ గద్వాల 28. కామారెడ్డి 39. కరీంనగర్ 97. ఖమ్మం 79. కొమరం భీం ఆసిఫాబాద్ 5. మహబూబ్ నగర్ 36.
మహబూబాబాద్ 36. మంచిర్యాల 55. మెదక్ 25. మేడ్చల్ మల్కాజ్ గిరి 154. ములుగు 29. నాగర్ కర్నూలు 21. నల్గొండ 126. నారాయణపేట 11. నిర్మల్ 18. నిజామాబాద్ 49. పెద్దపల్లి 33. రాజన్న సిరిసిల్ల 31. రంగారెడ్డి 211. సంగారెడ్డి 42. సిద్దిపేట 100. సూర్యాపేట 57. వికారాబాద్ 22. వనపర్తి 21. వరంగల్ రూరల్ 24. వరంగల్ అర్బన్ 48. యాదాద్రి భువనగిరి 28. మొత్తం : 1896.