COVID 19 in Telangana : 24 గంటల్లో 1,967 కేసులు, కొలుకున్నది 2,059 మంది

Eatala Rajender : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,967 కేసులు నమోదయ్యాయని, 2,059మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ (Media Bulletin) విడుదల చేసింది.
మొత్తం కేసుల సంఖ్య 1,85,833 కు చేరాయి. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,54,499 గా ఉంది. ఒక్క రోజులో 09 మంది చనిపోయారని వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 83.13శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59 ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 30,234, నివాసాలు / సంస్థల ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు 24,607గా తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 17. భద్రాద్రి కొత్తగూడెం 91. జీహెచ్ఎంసీ (GHMC) 297. జగిత్యాల 56. జనగామ 24. జయశంకర్ భూపాలపల్లి 20. జోగులాంబ గద్వాల 19. కామారెడ్డి 56. కరీంనగర్ 152. ఖమ్మం 78. కొమరం భీం ఆసిఫాబాద్ 15. మహబూబ్ నగర్ 25.
మహబూబాబాద్ 66. మంచిర్యాల 31. మెదక్ 24. మేడ్చల్ మల్కాజ్ గిరి 137. ములుగు 34. నాగర్ కర్నూలు 27. నల్గొండ 105. నారాయణపేట 8. నిర్మల్ 26. నిజామాబాద్ 61. పెద్దపల్లి 40. రాజన్న సిరిసిల్ల 44. రంగారెడ్డి 147. సంగారెడ్డి 54. సిద్దిపేట 70. సూర్యాపేట 46. వికారాబాద్ 18. వనపర్తి 25. వరంగల్ రూరల్ 26. వరంగల్ అర్బన్ 89. యాదాద్రి భువనగిరి 37. మొత్తం : 1967.