CM KCR Health : సీఎం కేసీఆర్‌ మెడికల్ రిపోర్టులో ఏముంది?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రితో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు.

CM KCR Health : సీఎం కేసీఆర్‌ మెడికల్ రిపోర్టులో ఏముంది?

సీఎం కేసీఆర్ మెడిక‌ల్ రిపోర్టులో ఏముంది

Updated On : April 22, 2021 / 7:40 AM IST

Medical examinations for CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రితో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు. బ్లడ్‌ టెస్టుల రిపోర్టులు ఇవాళ రానున్నాయి. అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ఎంవీ రావు వివరించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్‌మౌస్‌లో ఆయన కరోనాకు చికిత్స పొందుతున్నారు.

నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు వైద్యులు. అయితే నిన్న కొన్ని వైద్య పరీక్షలు నిమిత్తం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రికి మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్‌ ఎం.వి.రావు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని.. జనరల్‌ టెస్ట్‌ల కోసం రక్త నమూనాలు సేకరించామన్నారు. ఇవాళ బ్లడ్‌ రిపోర్ట్ వస్తుందని.. త్వరలోనే సీఎం కేసీఆర్‌ కోలుకుంటారని డాక్టర్ ఎంవీరావు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు సిటి స్కాన్‌, సి-రియాక్టివ్ ప్రొటిన్స్‌, డీ డైమర్‌, ఇంటర్‌ ల్యుకిన్, కంప్లిట్ బ్లడ్ పిక్చర్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు వైద్యులు నిర్వహించారు.

కరోనా స్థాయి తెలుసుకునేందుకు సి-రియాక్టివ్ ప్రొటిన్స్‌, డీ డైమర్‌, ఇంటర్‌ ల్యుకిన్ టెస్టులు కీలకం. వీటి ద్వారా కరోనా స్థాయి ఎంత ఉందో తెలుస్తుంది. బ్లడ్‌ శాంపిల్ సేకరించి, ఈ టెస్టులను చేశారు. చెస్ట్ సిటి స్కాన్ ద్వారా ఊపిరితిత్తులపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేస్తారు. అదేవిధంగా సిబిపి అంటే కంప్లిట్ బ్లడ్ పిక్చర్‌, లివర్ ఫంక్షన్ టెస్టుల ద్వారా సాధారణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అంచనా వేస్తారు.

సీఎం కేసీఆర్‌ కంటే ముందే యశోద ఆస్పత్రికి చేరుకున్న మంత్రి కేటీఆర్, కూతురు కవిత భర్త అనిల్ దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. టెస్టులు పూర్తయ్యాక సీఎం కేసీఆర్‌ తిరిగి కాన్వాయ్‌లోనే తిరిగి ఫాం హౌస్‌కు వెళ్లిపోయారు.