చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది- హరీశ్ రావుకి మంత్రి కౌంటర్

తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం తప్ప ఏపీ ప్రజల ఆలోచనలు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది- హరీశ్ రావుకి మంత్రి కౌంటర్

Duddilla Sridhar Babu : హామీల అమలు విషయంలో ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, బుద్ది తెచ్చుకోవాలి అంటూ మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. మేము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం అని అన్నారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే మీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది అని హరీశ్ రావుని ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం తప్ప ఏపీ ప్రజల ఆలోచనలు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

12ఏళ్ల తర్వాత గ్రూప్-1 పరీక్ష మేమే నిర్వహించాం అని గుర్తు చేశారాయన. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. 3 నెలలు పరిపాలన చేయగానే.. ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడే కోడ్ ముగిసిందని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక హామీలు అమలు చేస్తాం అని ప్రకటించారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్ కు లేదని మండిపడ్డారు. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్స్ ను తొక్కించారని ధ్వజమెత్తారు.

అటు పెద్దపల్లి ఘటన జరగడం దురదృష్టకరం అన్న మంత్రి శ్రీధర్ బాబు.. ఆ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు.. దాని వెనక ఎవరి హస్తం ఉన్నా ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.

కాగా, అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా.. ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు పెన్షన్లు పెంచారని, ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి అని హరీశ్ రావు విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు.

Also Read : కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ