Harish Rao : బెంగళూరులో ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేతవే.. రాష్ట్రంలో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారు : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.

Harish Rao : బెంగళూరులో ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేతవే.. రాష్ట్రంలో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారు : మంత్రి హరీష్ రావు

Harish Rao allegations Congress

Harish Rao – Congress : కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివేనని తెలిపారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంత్రి మెదక్ లో మీడియాతో మాట్లాడారు.

గతంలో కర్ణాటకలో 40 శాతం కమీషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమీషన్ నడుస్తుందన్నారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణకి డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. రూ.1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువు అని ఎద్దేవా చేశారు.

Gangula Kamalakar : ఆంధ్రావాళ్లు వస్తున్నారు..ఎన్నికలప్పుడు వచ్చేవారిని నమ్మొద్దు : గంగుల కమలాకర్

పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.

బెంగళూరు వయా చెన్నై కొంత హైదరాబాద్ కి కూడా డబ్బులు చేరాయని తెలిపారు. కొంతమంది బిల్డర్లకు డబ్బులు వచ్చాయని తెలిసిందని, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తానని అనుకోవడం ఓ పగటి కల అని అన్నారు. కాంగ్రెస్ లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్ ఇస్తారని పేర్కొన్నారు.