Minister Harish Rao : కేసీఆర్ అంటే నమ్మకం .. కాంగ్రెస్ అంటే నాటకం : హరీశ్ రావు
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.

Minister Harish Rao
BRS Minister Harish Rao : ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ గులాబీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం కసరత్తులు చేస్తుంటే గులాబీ పార్టీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. ఓ పక్క మంత్రి కేటీఆర్, మరోపక్క మంత్రి హరీశ్ రావు..ఇక గులాబీ బాస్ సభలతో హోరెత్తిస్తున్నారు. దీంట్లో భాగంగా మంత్రి హరీశ్ రావు ఇబ్రహీంపట్నంలో తనదైన శైలిలో కాంగ్రెస్ పై సెటైర్లతో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ అంటే నమ్మకం..కాంగ్రెస్ అంటే నాటకం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని మోసకారుల చేతిలో పెట్టవద్దని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నీటి ప్రాజెక్టులు కట్టి సాగునీరు, తాగునీటి కష్టాలు తీర్చిన కేసీఆర్ కు ఓటు వేయాలన్నారు.
ఇండియా కూటమికి ఫండ్ ఇస్తా తనను ప్రధానిని చేయమని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు : కోమటిరెడ్డి రాజగోపాల్
పాలమూరు ఎత్తిపోత పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీం పట్నం రూపు రేఖలు మారిపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తున్న రైతు బంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ వస్తే రైతు బంధు పథకం ఉండదని రైతులు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలన్నారు.వ్యవసాయం రంగాన్ని దెబ్బతీసే పార్టీ కాంగ్రెస్ అయితే వ్యవసాయాన్ని పండుగ చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
గతంలో విద్యార్ధులు డాక్టర్ విద్య కోసం ఎంతో కష్టపడేవారని..బీఆర్ఎస్ పాలనలో ఆ కష్టాలు పోయాకని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నామని అన్నారు. దీంట్లో భాగంగా ఇబ్రహీం పట్నం,మహేశ్వరం నియోజక వర్గాల మధ్య పెద్ద మెడికల్ కాలేజీని నిర్మించుకోబోతున్నామని దాని కోసం ఇప్పటికే శంకుస్థాపన కూడా పూర్తి అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదు వందల పడకల మెడికల్ కాలేజీని నిర్మించుకోబోతున్నామని ఇవన్నీ అమలులోకి రావాలంటే కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు.