Harish Rao : రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ కు రైతులే బుద్ధి చెప్పాలి : మంత్రి హరీష్ రావు

రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు.

Harish Rao : రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ కు రైతులే బుద్ధి చెప్పాలి : మంత్రి హరీష్ రావు

Minister Harish Rao (5)

Harish Rao Serious Comments : కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక రైతులు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం గ్రామంలో సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన వస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని ఎద్దేవా చేశారు. రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చిన ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతు బంధు డబ్బులు ఓట్ల ముందు ఇస్తున్నారు…. తర్వాత బంద్ అయిపోతాయి అన్నారు కాంగ్రెసోల్లు అని అన్నారు. రేవంత్ మూడు గంటల కరెంటు సాలన్నాడని తెలిపారు. మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Kasani Gnaneshwar : తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే.. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కాసాని జ్ఞానేశ్వర్

రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ కు రైతులే బుద్ధి చెప్పాలన్నారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు. కానీ, ఇక్కడున్న ప్రతిపక్ష గజనీలకు అభివృద్ధి కనిపించడం లేదన్నారు.

చింతా ప్రభాకర్ ఓడిపోయినా గత అయిదు ఏండ్లలో ప్రజల్లోనే ఉన్నారని, కరోనా సమయంలో ప్రజల్లోనే ఉన్నారని తెలిపారు. గెలిచిన జగ్గారెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నాడని తెలిపారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. మత రాజకీయాలు అభివృద్ధికి అడ్డంకిగా మారుతాయని తెలిపారు. పనితనం తప్ప….. పగతనం తెలియని నాయకులు కేసీఆర్ అని అన్నారు.