Minister Harish Rao : గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం : మంత్రి హరీష్ రావు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అయిందని మంత్రి హరీష్ రావు అన్నారు.

Minister Harish Rao : గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం : మంత్రి హరీష్ రావు

Harish Rao

Updated On : August 11, 2021 / 4:45 PM IST

TRS public meeting : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇల్లందుకుంటలో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఈటల గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడని… అంతకుమించి ఏం చేస్తారని విమర్శించారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా గెలుస్తాడు……ప్రజలుగా మనం ఓడిపోతామని చెప్పారు. ఈటల రాజేందర్ ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కూడా కేసీఆర్ అని తెలిపారు. గులాబీ జెండా ఈటలను పెద్దది చేసిందని పేర్కొన్నారు. తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెలా మీద తన్నింది ఈటల రాజేందర్ అని విమర్శించారు.

రైతు బందు వద్దు, దళిత బంధు వద్దు, ఆసరా పింఛన్ పరిగేరుకున్నట్లు అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం న్యాయమా అన్నారు. రైతు బంధు వద్దన్న ఈటల.. రైతు బందు పేరిట రూ.10 లక్షల తీసుకున్నారని గుర్తు చేశారు. ‘కేసీఆర్ ను రా అనొచ్చా….నన్ను రా రా అంటున్నాడు…ఇది నీ సంస్కారం…మేము రాజేందర్ గారు అనే పిలుస్తాం’ అని మంత్రి అన్నారు. ఓటమి భయంతోనే ఈటల ఈవిధంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. సిరిసేడును దత్తత తీసుకున్న ఈటల..ఒక్క ఇల్లు నిర్మించ లేదని విమర్శించారు. కేసీఆర్ 4000 ఇళ్లు కట్టివ్వు రాజేందర్ అని చెప్పినా… ఒక్కటి కూడా కట్టివ్వలేదని పేర్కొన్నారు. మంత్రిగా ఉండి పని చేయ్యని ఈటల.. ఇప్పుడు ఎలా చేస్తారని నిలదీశారు. బీజేపీలో చేరినప్పుడే ఈటల పని అయిపోయిందన్నారు.

బండి సంజయ్ ఎంపీగా గెలిచి.. రూ.10 లక్షల పనైనా చేశాడా అని నిలదీశారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ లేదు…బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్యే పోటీ అని స్పష్టం చేశారు. బీజేపీ.. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సహాయం చేస్తుంటే.. బీజేపీ లాక్కుంటుందని ఎద్దేవా చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని…బీజేపీ ఏం చేసిందని నిలదీశారు. కాళేశ్వరం ద్వారా తొలి ఫలితం హుజూరాబాద్ ప్రజలకే దక్కిందన్నారు. ఇన్ని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. హుజూరాబాద్ లో రాజేందర్ కు లాభం జరగాలా? ప్రజలకు లాభం జరగాలా? అనే చర్చ జరగాలన్నారు.

కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.10 కోట్లతో ఇళ్ళందకుంట రాములవారి టెంపుల్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. సిద్దిపేటలో మహిళ భవనం లేని ఉరు లేదు.. మరి హుజూరాబాద్ లో ఎందుకు కట్టివ్వలేదని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి…మహిళ భవనాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈటల గడియారాలు, ఫోన్స్, కుక్కర్లు, గ్రైండర్లు పంచుతున్నారని.. ఇన్ని సార్లు గెలిచావుగా ఇవి ఎందుకు పంచుతున్నావు.. ఆత్మగౌరవం అంటే ఇదేనా? అని నిలదీశారు. ఈటల రాజేందర్ చెప్పేవి నీతులు…చేసేది గీ పనులా అని నిల దీశారు.

తాము దళిత బందు, కళ్యాణ లక్ష్మీని నమ్ముకున్నామని తెలిపారు. ఇప్పుడు రెండు గుంటల మధ్య రెండు వందల ఎకరాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో గెల్లు శ్రీనివాస్ 21 ఎళ్ళు పని చేశాడని తెలిపారు. కేసీఆర్, మంత్రుల ఆశ్వీరాదం గెల్లు శ్రీనివాస్ కు ఉందన్నారు. ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని…గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి అని హరీష్ రావు పిలుపునిచ్చారు. ‘మన గుర్తు కారు….ఎప్పుడు మనది కారు గుర్తే…మీరు ఇంతకాలం కారు గుర్తుకే ఓటు వేశారు…మళ్ళీ కారుకే వేయాలి’ అని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని తెలిపారు. కారు గుర్తు మరవద్దు…గెల్లు శ్రీనివాస్ ను ఆశీర్వదించండన్నారు.