KT Rama Rao : రెండు నెలల్లో ఎన్నికలు..! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KT Rama Rao : తెలివైన వాళ్లు ఎవరూ జేబులో ఉన్న వంద రూపాయలు కిందపడేసి చిల్లర నాణెలు ఏరుకోరు. పని చేసే గవర్నమెంట్ ని ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను.

KT Rama Rao : రెండు నెలల్లో ఎన్నికలు..! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KT Rama Rao (Photo : Twitter)

Updated On : June 5, 2023 / 8:58 PM IST

KT Rama Rao – Assembly Elections : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎంగా కేసీఆరే ఎన్నిక అవుతారని జోస్యం చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసున్నారు కేటీఆర్. పని చేసే ప్రభుత్వాలను ప్రజలు కచ్చితంగా వదులుకోరని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

తెలివైన వాళ్లు ఎవరూ జేబులో ఉన్న వంద రూపాయలు కిందపడేసి చిల్లర నాణెలు ఏరుకోరు. పని చేసే గవర్నమెంట్ ని ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను. రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అది మాకు తెలుసు. మీకు తెలుసు. ప్రతిపక్షాలకు కూడా తెలుసు.

Also Read..YS Sharmila : కవిత అరెస్ట్ ఎప్పుడు? కారు, కమలం రెండూ ఒక్కటే..!- వైఎస్ షర్మిల

ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రం వచ్చిన తొలినాళ్ల కంటే ఇప్పుడు మెరుగైన ప్రగతి సాధించామని, ఐటీ ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు భారీగా పెరిగాయని.. వరంగల్, కరీంనగర్ లాంటి సిటీలతో పాటు కొన్ని పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

Also Read..TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు