Minister KTR : ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం : రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్
దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం అంటూ తెలంగాణ పర్యటనలో రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

Minister KTR
Minister KTR countered Rahul Gandhi : దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం అంటూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం బూత్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతు..ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ పోరాటంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే గెలుస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ సినిమాలో కమల్ హాసన్ తనకు పని ఇప్పిస్తానని మాట ఇచ్చిన వ్యక్తిని పని కోసం ఎంతలా వెంటాడి వేధించి పని సాధించుకున్నాడో ఆ లెక్కన మీరు కూడా పనిచేయాలని యూత్ కమిటీ సభ్యులకు సూచించారు. ఎన్నికలు అయ్యేంత వరకు బయట తిరగటం మానేసి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ కు ఓటు వేసేలా పనిచేయాలని సూచించారు. పనికిరాని తిరుగుళ్లు కట్టిపెట్టి ఎన్నికలు అయ్యేంత వరకు ఓటర్లను కలిసి నిరంతరం బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కే ఓటు వేస్తామని ఓటర్లు చెప్పేంత వరకు పనిచేయాలన్నారు.
ఇంద్రకరణ్‌ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పిస్తా : కేసీఆర్
కానీ ఓటర్లను మరీ విసిగించకుండా సతాయించకుండా మర్యాదగా చెప్పాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన మంచి పనులను వారికి గుర్తు చేయాలని..కరెంట్ సదుపాయాలు..మంచి నీటి సదుపాయాలతో పాటు స్థానికంగా డెవలప్ అయిన మౌలిక సదుపాయాలు అన్నీ బీఆర్ఎస్ పాలనలోనే వచ్చాయని వారికి గుర్తు చేసి మరోసారి ఓటు వేయాలని సూచించాలని చెప్పారు.
మరోసారి అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తారని చెప్పాలన్నారు. పొలం ఉన్నా లేకపోయినా ఈ భీమా వర్తిస్తుందని చెప్పాలన్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు మరింత లబ్ది చేకూరాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పాలని ప్రతీ ఒక్క బూత్ కమిటీ అభ్యర్ధి ఈ బాధ్యత తీసుకుని పనిచేయాలని సూచించారు. వృద్ధాప్య పెన్షన్ ఇప్పటి వరకు ఇచ్చే రూ.2వేలను రూ.5వేలకు పెంచుతారని చెప్పాలన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే రూ. 2వేల రూపాయల పించన్ రూ.5వేలకు పెంచుతారని తెలిపారు.