CM KCR : ఇంద్రకరణ్‌ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పిస్తా : కేసీఆర్

నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని..మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

CM KCR : ఇంద్రకరణ్‌ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పిస్తా : కేసీఆర్

CM KCR In Nirmal

Updated On : November 2, 2023 / 4:19 PM IST

CM KCR In Nirmal : ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు. దీంట్లో భాగంగా గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని..ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా ఏర్పాటైందని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధింగా నిర్మల్ జిల్లా అభివద్ధిలో దూసుకుపోతోందని అటువంటి నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని..మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

CM KCR : కేసీఆర్ చెప్పాడంటే శిలాశాసనమే, ఆరు నూరైనా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్

ఎన్నికల వేళ ఎన్నో పార్టీలు వస్తాయి. ఓట్లు అడగుతాయి. కానీ ఏ పార్టీ ఎటువంటిదో.. ఏ అభ్యర్థి ఎలాంటివాడో తెలుసుకుని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఓటు అనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉండే వజ్రాయుధం అని ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టి అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నడూ ఊహించని విధింగా నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు.

రాష్ట్రాన్ని శాంతి యుతంగా ముందుకు తీసుకెళుతున్నామని గిరిజన జిల్లాగా పేరొంది..అభివద్ధికి నోచుకోని జిల్లాను రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని..నిర్మల్ ఈరోజున ఇలా ఉందంటే ఇంద్రకరణ్ రెడ్డి వల్లేనన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇలా మరింతగా మీ ఆశలకు..ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని హామీ ఇఛ్చారు. ప్రలోభాలకు లొంగిపోకుండా కత్తులతో దాడులకు పాల్పడే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

CM KCR : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్

రైతులకు 24 గంట విద్యుత్ కావాలన్నా..రైతు బంధు అమలు కొనసాగాలన్నా..మీకు వచ్చే పించన్లు సకాలంలో సక్రమంగా రావాలన్నా బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. రైతు బంధు పథకంలో రైతన్నల ముఖాల్లో సంతోషాలు కనిపిస్తున్నాయని ఆ సంతోషం నిరంతరం ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, అభ్యర్ధుల నడవడికలను చూసి ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.