Minister KTR : వాళ్లది సెంటిమెంట్ రాజకీయం .. మాది సెంట్‌మెంట్ రాజనీతి : కేటీఆర్

సొంత రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారు..తెలంగాణకు ఆ రాష్ట్రాలకు పోలిక లేదు అంటూ విమర్శించారు.

Minister KTR :  వాళ్లది సెంటిమెంట్ రాజకీయం .. మాది సెంట్‌మెంట్ రాజనీతి : కేటీఆర్

Minister KTR

Updated On : August 5, 2023 / 5:14 PM IST

Minister KTR key comments in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు అసెంబ్లీలో పల్లె,పట్టణ ప్రగతిపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తు వారిది సెంటి మెంట్ రాజకీయం..మాది సెంట్ మెంట్ రాజనీతి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారు..తెలంగాణకు ఆ రాష్ట్రాలకు పోలిక లేదు అంటూ విమర్శించారు.

TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం

సీఎం కేసీఆర్ రాష్ట్ర్ ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ మాత్రం అధికారం కోసం మాత్రమే ఆలోచిస్తోంది అంటూ విమర్శించారు. ప్రజల కోసం ప్రగతి కోసం ఆలోచించే తీరక కాంగ్రెస్ లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదని ప్రధాని మోదీకే భయపడలేదని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో కరవు, కష్టాలే ఉండేవి కానీ ఇప్పుడు సంక్షేమం త‌ప్ప‌.. సంక్షోభం లేదు అని అన్నారు మంత్రి కేటీఆర్.

Telangana Assembly : అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో గ్రూప్ ఫోటో దిగనున్న సీఎం కేసీఆర్

సొంత రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మ‌కంగా ప‌ని చేస్తున్నామని అన్నారు.ఒక వైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మ‌రో వైపు మౌలిక వ‌స‌తుల‌కు భారీగా కేటాయింపులు చేస్తున్నామని వివరించారు. బ‌డ్జెట్ పెట్టుబ‌డి వ్య‌యంలో తెలంగాణే ముందుంది. బ‌డ్జెట్‌లో పెట్టుబ‌డి వ్య‌యం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 15 శాతం, రాజ‌స్థాన్‌లో 16 శాతం మాత్ర‌మే ఉందన్నారు. బీఆర్ఎస్‌కు బ‌డ్జెట్ అంటే రాష్ట్ర ప్ర‌జ‌ల జీవ‌న‌రేఖ అని అన్నారు. వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. ఒకప్పుడు కరవుతో ఉన్న తెలంగాణ‌లో ఇప్పుడు సంక్షేమ‌మే త‌ప్ప‌.. సంక్షోభం లేదన్నారు. మా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌తో తెలంగాణ‌లో ప‌ల్లె మురిసింది.. ప‌ట్ట‌ణం మెరిసిందని అన్నారు. కాంగ్రెస్ పాల‌న ఎంత చెత్త‌గా ఉండేదో ఆనాడే స‌భ‌లో రేవంత్ రెడ్డి చెప్పారు అంటూ కేటీఆర్ గుర్తు చేశారు.