చిన్నారి క్రికెట్ కు కేటీఆర్ ఫిదా..లక్ష్మణ్ ఏమంటావ్

చిన్నారి క్రికెట్ కు కేటీఆర్ ఫిదా..లక్ష్మణ్ ఏమంటావ్

Updated On : January 18, 2021 / 3:05 PM IST

children cricket Play : సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ యాక్టివ్ గా ఉంటుంటారు. సమస్యలకు పరిష్కారం చూపెడుతుంటారు. తాజాగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ..ఓ వీడియో ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఆయన…Fabulous talent అంటూ కితాబిచ్చారు. ఈ వీడియో ను చూసి ఏమంటారు అంటూ..వీవీఎస్ లక్ష్మణ్, హర్ష భోగ్లే అంటూ వారిద్దరినీ ట్యాగ్ చేశారు.

అసలు ఆ వీడియోలో ఏముంది అంటారా ? ఓ చిన్నారి క్రికెట్ ఆడుతున్నాడు. అతను కొట్టే షాట్స్ అందరి చేత వావ్ అనిపిస్తున్నాయి. బ్యాట్ పట్టి అలవొకగా కవర్ డ్రైవ్, షాట్స్ కొడుతున్నాడు. నాలుగేళ్ల వయస్సులో మరింత టాలెంట్ చూపుతున్నాడు. ఈ వీడియోను ఎస్కే షాహిద్ అనే నెటిజన్ చూశాడు. మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. ఆయన వీడియో చూసి ముచ్చటపడ్డారు. అమోఘమైన ప్రతిభ అంటూ కితాబునిచ్చారు. దీనికి లక్ష్మణ్ స్పందించారు. చిన్నారిలో అద్భతుమైన ప్రతిభ దాగి ఉందని మెచ్చుకున్నారు. ఇంత చిన్న వయస్సులోనే టెక్నిక్ గా ఆడుతున్న చిన్నారిలో ప్రత్యేక ప్రతిభ ఉందని ప్రశంసించారు.