Minister Mallareddy: ఐటీ అధికారులు డబ్బున్న గదినే చూడలేదు.. ఆ డబ్బులే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న..

ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే. గత ఎన్నికల్లో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది నేనే అంటూ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Minister Mallareddy: ఐటీ అధికారులు డబ్బున్న గదినే చూడలేదు.. ఆ డబ్బులే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న..

Minister Mallareddy

Updated On : August 3, 2023 / 3:01 PM IST

Mallareddy Sensation Comments: మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా మరోసారి ఆయన సంచనల వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడారు. గతంలో ఆయన నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ మల్లారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదు. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Mallareddy: కుల రాజకీయాలు చేస్తున్నారు.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే. గత ఎన్నికల్లో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది నేనే అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ గొడవలు మేమే సృష్టిస్తున్నామ్. మా మనుషులను హరివర్ధన్ వర్గం కార్యకర్తలుగా పంపి కేఎల్‌ఆర్‌ను నిలదీశాం అని మల్లారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంలో నాకు దోస్తులు ఉన్నారు.

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

మంత్రివర్గ విస్తరణ అంటే మల్లారెడ్డి పోస్ట్ ఊడుతుందనే ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాత నా గ్రాఫ్ పెరిగింది. తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోయి.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.