Minister Niranjan Reddy: ఒక్క ఆరోపణ రుజువు చేసినా రాజీనామా చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
27వ తేదీ తరువాత నా వ్యవసాయక్షేత్రానికి మీడియాను తీసుకెళ్తా. ఆరోజు రఘునందన్ రావు రావాలి. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Menister Niranjan Reddy
Minister Niranjan Reddy: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాపై చేసిన ఒక్క ఆరోపణ నిరూపించినా తక్షణమే రాజీనామా చేస్తానని, సంచలనాలకోసం మాట్లాడే తత్వం నాదికాదని మంత్రి అన్నారు. నాకు ఉద్యమ సహచరుడుగా ఉన్న రఘునందన్ రావు ఎందుకో నాపై వ్యక్తిగత దూషణలు, నిందలు వేశారని, 39ఏళ్ల రాజకీయంలో ఏనాడు నేను తప్పుడు పనులు చేయలేదని చెప్పారు. రఘునందన్‌పై అభాండాలు వేసి నా స్థాయి నేను తగ్గించుకోనని అన్నారు. 60 సర్వే నెంబర్‌లో ముంపుకు గురై మిగిలిన భూమి మేము కొన్నాం. మీరు ఇప్పుడైనా రావచ్చు, మీ ఆరోపణలు తప్పని తేలితే నాపై చేసిన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటానని ప్రకటన చాలు. నీ రాజీనామా మాకు అవసరం లేదు అంటూ రఘునందన్ రావుకు మంత్రి సవాల్ చేశారు.
న్యాయవాదిగా ఉండి రఘునందన్ రావు దారుణంగా మాట్లాడారని, ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. 90కి పైగా ఎకరాల భూమి అక్కడ ఉంది? మాకు భూమి ఆమ్మిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. డిజిటల్ రికార్డ్‌ల పైనే ప్రభుత్వం ఆధారపడి ఉంది. నీచమైన ఆరోపణలు, స్పృహ లేకుండా మాట్లాడటం సరికాదంటూ రఘునందన్ రావుకు మంత్రిసూచించారు. ఎన్నికల అఫిడవిట్‌లో నేను నా భూమి వివరాలు వెల్లడించాను. ఆ ఇంటిని నాలుగు కోట్ల రూపాయలకు అమ్మేస్తా తీసుకోవచ్చు. నా ఇంటికి వస్తే ఆహ్వానిస్తా.. షరతులు అంగీకరించి ఎప్పుడైనా రావచ్చు. సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు నుంచి భూమి కొనుగోలు చేశాం. మా పొలానికి వేసింది ప్రభుత్వ నిధుల నుంచి వేసిన రోడ్డు కాదు. సొంతగా వేసుకున్న రహదారి. ఇది కూడా తప్పా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
27వ తేదీ తరువాత నా వ్యవసాయక్షేత్రానికి మీడియాను తీసుకెళ్తా. ఆరోజు రఘునందన్ రావు రావాలి. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి. ఎప్పుడైనా రఘునందన్ రావు టైం ఇస్తే ఆరోజైన నేను రెడీ. ఆ గ్రామాల ప్రజలను, రైతులను ఆరోజు పిలిపిస్తాం. ఒక్క ఆరోపణ రుజువు చేసినా నేను తక్షణమే రాజీనామా చేస్తా అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.