హైదరాబాద్‌లో వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar: రేషన్ కార్డుల జారీలో తమ ప్రభుత్వం కొత్త నిబంధనలేవీ పెట్టడం లేదని, గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar: హైదరాబాద్ జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీలో తమ ప్రభుత్వం కొత్త నిబంధనలేవీ పెట్టడం లేదని, గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని, ఈనెల 16 నుంచి 20వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారి డేటా ఎంట్రీ ఈనెల 21 నుంచి చేపడతామని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Danam Nagender: ఫార్ములా ఈ-కార్ రేసు, హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
జిల్లాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు.
Also Read: Rythu Bharosa: రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వారు మాత్రమే అర్హులు
హైదరాబాద్ జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు సహకరించాలని మంత్రి పొన్నం కోరారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేస్తామని, ఈ విషయంపై గుత్తేదారులతో మాట్లాడి, పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు.