Yasangi Paddy Crop : యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు-ప్రశాంత్‌రెడ్డి

రాష్ట్రంలో  యాసంగిలో  కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Yasangi Paddy Crop : యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు-ప్రశాంత్‌రెడ్డి

Vemula Prasanth Reddy

Updated On : December 4, 2021 / 2:10 PM IST

Yasangi Paddy Crop :  రాష్ట్రంలో  యాసంగిలో  కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్లమెంట్‌లో టి.ఆర్.ఎస్. ఎం.పి.లు వరి రైతుల కోసం పోరాటం చేసినా.. కేంద్రం వడ్లు కొనుగోలు చేయమని స్పష్టం చేసిందని వివరించారు. ధాన్యం కొనుగోలు రాష్ట్రం చేతిలో లేదని మంత్రి ప్రకటించారు.

నిజామాబాద్ కలెక్టరేట్‌లోఈ రోజు జరిగిన ఉమ్మడి జిల్లా నీటి పారుదల బోర్డ్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. శ్రీరాం సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి యాసంగి నీటి విడుదల ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల కింద మొత్తం 2.66 లక్షల ఎకరాలకు 23.832 టి.ఎం.సి.ల నీటిని కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. యాసంగిలో పంటలకు ఢోకా లేదన్న మంత్రి… లాభ సాటి పంటలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.