Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు

తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.

Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు

AC sleeper buses

Tirumala – Shirdi : తిరుమల, షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుమల, షిర్డీకి ప్రభుత్వం ఏసీ స్లీపర్ బస్సులు నడపనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల, షిర్డీకి ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.

TSRTC: భక్తులకు శుభవార్త.. అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్-తిరుమలకు రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పెద్దలకు రూ.4,200, పిల్లలకు రూ.3,360 టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీలో భక్తులకు శ్రీఘ్రదర్శన టికెట్లను అందించనున్నట్లు వెల్లడించారు.

కొత్తగా రూ.3.5 కోట్లతో 2 అత్యాధునిక ఓల్వో మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బసు సర్వీసులను,
32.61 లక్షలతో మినీ ఏసీ బస్సు సర్వీసులను పర్యాటక శాఖ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యటక శాఖ ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.