Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్
Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్
Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ ను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పూర్తి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కోర్టును ఆశ్రయించారు.
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ట్‌ను కోర్టులో న్యాయవాదులు అభ్యర్థించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో వారు ఇంకా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రొసీడింగ్స్ ఆలస్యం చేస్తే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ, ఇంకా ప్రొసీడింగ్స్ ఎవిడెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి వచ్చే సోమవారం కేసు విచారణ చేస్తామని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తికావడంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
