Eatala Rajender : ట్విట్టర్ లో ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు.

Eatala Rajender : ట్విట్టర్ లో ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Eatala Rajender (1)

Updated On : July 2, 2023 / 12:26 AM IST

Twitter Interesting Comments : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు. తనకు కీలక పదవి రాబోతోందన్న అర్థం వచ్చేలా ఈటల వ్యాఖ్యలు చేశారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు.. సర్పంచ్ నుండి పార్లమెంట్ సభ్యుని దాకా గెలవాలని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఈటల రాజేందర్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అనేక కష్ట, నష్టాలకోర్చారని పేర్కొన్నారు. అవమానాలు భరించారు.. త్యాగాలు చేశారని కొనియాడారు.

Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు టీటీడీ ఏర్పాట్లు

పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికునిలా పని చేస్తానని.. ప్రజలకు అండగా ఉంటానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.