Jagga Reddy : ఎన్ని కుట్రలు చేసినా నేనే సీఎం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను..తనను ఎన్నికలలో పాల్గొనకుడా చేసేందుకు కుట్రను జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నాభార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు.

Jagga Reddy : ఎన్ని కుట్రలు చేసినా నేనే సీఎం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLA Jagga Reddy

Updated On : October 24, 2023 / 10:11 AM IST

Congress MLA jagga reddy CM Comments : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ గ్రౌండ్ లో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి ‘నేనే సీఎం’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ప్రజల ఆశీస్సులు ,రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను మరో పదేండ్లకైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయి తీరుతా అంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రజలకు నిరంతరం అందుబాటులోనే ఉంటా కానీ ఫోన్ లో అందుబాటులో ఉండకపోవచ్చు..అది నా స్టైల్.. కానీ నా ఫాలోవర్స్ గానీ..నా భార్య గానీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అని అన్నారు.

ఈ ఏడాది ఎన్నికల కోడ్ ఉండటంతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం లేదని కానీ వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను..తనను ఎన్నికలలో పాల్గొనకుడా చేసేందుకు కుట్రను జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నాభార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు. నాకంటే ఆమే బెటర్ అంటూనే తాను ఫోన్ లో దొరకను గానీ నా భార్య మాత్రం ఎప్పుడు ఫోన్లో బాధితులకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.

CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ తనపై ఉండాలని కోరారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణదహనం కార్యక్రమంలో పొల్గొన్న జగ్గారెడ్డి భక్తులతో కలిసి ఆడిపాడారు. దుర్గమ్మను కీర్తిస్తు పాటలు పాడారు. డ్యాన్సులు వేశారు. దసరా ఉత్సవాల్లో తన మనసులో మాట చెబుతున్నాను అంటూ మరో పదేళ్లకైనా తాను తెలంగాణకు సీఎం అయి తీరుతాను అంటూ ధీమా వ్యక్యం చేశారు.