MLA Jeevan Reddy : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బ్యాంకులను మోసం చేసిన వారిని బయటికి పంపిన చరిత్ర బీజేపీ నేతలదని ఆరోపించారు. నలుగురు ఎంపీలు తలో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.

MLA Jeevan Reddy : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy

Updated On : April 9, 2022 / 6:06 PM IST

MLA Jeevan Reddy : బీజేపీ నేతలపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బట్టే బాజ్ ఎంపీలకు బడా గ్యాంగ్ లీడర్ బండి సంజయ్ అని విమర్శించారు. బ్యాంకులను మోసం చేసిన వారిని బయటికి పంపిన చరిత్ర బీజేపీ నేతలదని ఆరోపించారు. నలుగురు ఎంపీలు తలో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఉందని సెటైర్ వేశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు బానిసలుగా తాము పని చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఎంపీలు అని విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ రైతుల దగ్గరకు వెళ్తే తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం 11వ తేదీ మహా ధర్నా నాటికి ధాన్యం కొనుగోలుకు ముందుకు వస్తే మంచిదన్నారు.

Jeevan Reddy : బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీకి తొత్తుగా పీసీసీ చీఫ్ రేవంత్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధాన్యం లెక్కలు కేంద్రం దగ్గర లేవా…తాము కొత్తగా ఇచ్చేది లేదన్నారు. దేశంలో రైతులను ఏకం చేస్తామని వెల్లడించారు. తాము అమలు చేస్తున్న పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. కేంద్రం పై పోరుకు ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే అన్నారు.