Malla Reddy : కేసీఆర్‌తో భేటీ అయిన మ‌ల్లారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై ఏమన్నారంటే?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.

Malla Reddy : కేసీఆర్‌తో భేటీ అయిన మ‌ల్లారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై ఏమన్నారంటే?

Malla Reddy

Malla Reddy Met KCR : బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. అయితే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కేసీఆర్ తో భేటీలో ఈ విషయంపై మల్లారెడ్డి చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మా కుటుంబ సభ్యులకు వద్దని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ మార్పు విషయంపైనా కేసీఆర్ వద్ద మల్లారెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, మీవెంటే నడుస్తానని కేసీఆర్ కు మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.

Also Read : కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి?

మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థల బిల్డింగ్ లు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో వీటిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు ఆధారంగా అధికారులు చర్యలు మొదలు పెట్టారు. తాజాగా భవనాల కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని, అల్లుడు రాజశేఖరరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేకాక, ఇటీవల వరకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పిన మల్లారెడ్డి.. ప్రస్తుతం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. తాజా పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డిని పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ తో భేటీలో బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మల్లారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.