MLA Tatikonda Rajaiah : కాంగ్రెస్తో కడియం శ్రీహరి టచ్లో ఉన్నారు.. : ఎమ్మెల్యే రాజయ్య
కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని..ఆయన చేసే అవినీతి గురించి నేను బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు..త్వరలో ఆయన అవినీతి బయటపెడతానంటూ మరోసారి విమర్శలు చేశారు రాజయ్య.

mla thatikonda rajaiah kadiyam srihari
MLA Tatikonda Rajaiah : వరంగల్ లోని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ( (station ghanpur BRS) లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Tatikonda Rajaiah ), ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (kadiyam srihari) మధ్య విభేదాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. రాజయ్య తనపై చేసే ఆరోపణలకు కడియం శ్రీహరి తీవ్రంగా మండిపడుతున్నారు. రాజయ్య చేసే వ్యాఖ్యలకు కడియం సమాధానం చెబుతున్నా..అతను మాత్రం ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా తరచు తీవ్ర ఆరోపణలు చేస్తునే ఉన్నారు. ఈక్రమంలో మరోసారి కడియంపై రాజయ్య మరోసారి ఘాటు విమర్శలు ఆరోపణలు విరుచుకుపడ్డారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ (BRS) లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని..ఆయన చేసే అవినీతి గురించి నేను బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అసలే తనపై చేస్తున్న విమర్శలకు కడియం మండిపోతుంటే దానికి మరింత ఆజ్యంపోస్తు పదే పదే విమర్శిస్తున్నారు రాజయ్య. దీంట్లో భాగంగానే కడియం శ్రీహరి అవినీతి చిట్టా విప్పే రోజుదగ్గరలోనే ఉందన్నారు.కడియం కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డితో బేరాలాడుతున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి కుమార్తెకు టికెట్ కోసం రేవంత్ రెడ్డితో కడియం బేరాలు ఆడుతున్నారని కూతురిని కాంగ్రెస్ లోకి పంపించటానికి మంతనాలు జరుపుతున్నారు అంటూ ఆరోపించారు.
Kadiyam Srihari : రాజయ్యా.. నీ పని అయిపోయిందయ్యా, శిశుపాలుని వధకు టైమొచ్చింది: కడియం శ్రీహరి
కాగా రాజయ్య చేసిన ఆరోపణలకు కడియం శ్రీహరి కూడా ధీటుగా బదులిస్తున్నారు. తరాజయ్య తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కులం పేరుతో దూషిస్తున్నారని..తన తల్లి కులం గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాజయ్య తనపై చేసిన ఆరోపణలకు, సవాళ్లకు బదులు ఇవ్వటానికి (జులై 10,2023)కడియం శ్రీహరి సోమవారం మీడియా ముందుకొచ్చారు. ‘కారణం ఏంటో తెలీదు కానీ, నాపై వ్యక్తిగతంగా నా తల్లి, బిడ్డపై స్థాయిని మరిచి నీచస్థాయిరి దిగజారి రాజయ్య మాట్లాడుతున్నారు.
2014, 2018 లో రెండుసార్లు పార్టీ నిర్ణయం మేరకు రాజయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేశానను. నా అభిమానులకు నచ్చచెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజయ్య గెలుపు కోసం కృషి చేశాను. అటువంటి నాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం బాధకలిస్తోంది అంటూ వాపోయారు. రాజయ్య వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని ఇక రాజయ్యపై అధిష్టానం చర్యలుతీసుకోవటానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈక్రమంలో మళ్లీ మళ్లీ రాజయ్య తనపై చేసిన ఈ ఆరోపణలు కడియం స్పందిస్తారా? లేదో వేచి చూడాలి.