ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద మహిళలు, పిల్లలు, వృద్ధులు గత రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఈనెల 3న ఆంక్షలు అమలు చేశారని తెలిపారు.

ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద మహిళలు, పిల్లలు, వృద్ధులు గత రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

Vedma Bhojju

Updated On : January 5, 2025 / 4:08 PM IST

నిర్మల్ జిల్లా ఫారెస్ట్ ఎఫ్‌డీపీటీ శాంతారాంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు నిబంధనల పేరుతో దాదాగిరి చేస్తానంటే ఉరుకోబోమని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఈనెల 3న ఆంక్షలు అమలు చేశారని తెలిపారు. కవ్వాల్ అభయారణ్యం గుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలను ఆపేస్తున్నారని చెప్పారు. ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద మహిళలు, పిల్లలు, వృద్ధులు నిన్న రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారని తెలిపారు.

వాహనాల రాకపోకలపై ఇచ్చిన ఆదేశాలు తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఆంక్షలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని అన్నారు. పులుల మీద ఉన్న ప్రేమ మనుషులపై కూడా ఉండాలని చెప్పారు. పనికిమాలిన రూల్స్ తో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఉండబోమని అన్నారు.

తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ వైఖరి తేటతెల్లమైంది: కేటీఆర్