Delhi liquor scam: మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకం: చార్జిషీట్లో ఈడీ

Delhi liquor scam: హైదరాబాద్ లో మూడు స్థలాలను కవిత కొనుగోలు చేసినట్లు ఈడీ చెప్పింది. చార్జిషీట్లో కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది.

Delhi liquor scam: మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకం: చార్జిషీట్లో ఈడీ

Delhi liquor scam

Updated On : May 1, 2023 / 5:47 PM IST

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకమని పేర్కొంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కవిత సమావేశమయ్యారని వెల్లడించింది.

అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చినట్లు ఈడీ తెలిపింది. కవిత ప్రతినిధిగా పిళ్లై, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి వ్యవహరించారని చెప్పింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చారని తెలిపింది. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.192 కోట్లతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారని బయటపెట్టింది.

హైదరాబాద్ లో మూడు స్థలాలను కవిత కొనుగోలు చేసినట్లు చెప్పింది. చార్జిషీట్లో కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కొన్ని రోజుల క్రితం ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించారు.

కవిత విచారణ సమయంలోనే తన ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఇటీవల సీబీఐ విచారించింది. ఇటీవలే 9 గంటల పాటు సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అసలు ఢిల్లీలో లిక్కర్ స్కాం జరగలేదని ఆప్ నేతలు అంటున్నారు. అయితే, లిక్కర్ స్కాం జరగకపోతే ఆ పాలసీని రద్దు చేసి, మళ్లీ పాత పాలసీనే ఎందుకు అమలు చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Delhi Liquor Scam: మోదీ జీ ఎన్ని కుట్రలు చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తారు: సిసోడియా