MLC Kavitha: తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయాలు – కవిత

జగిత్యాల పర్యటనలో భాగంగా మంగళవారం అక్కడకు వెళ్లిన కవిత.. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్, పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు.

MLC Kavitha: తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయాలు – కవిత

Mlc Kavitha

Updated On : June 15, 2021 / 5:44 PM IST

MLC Kavitha: జగిత్యాల పర్యటనలో భాగంగా మంగళవారం అక్కడకు వెళ్లిన కవిత.. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్, పాలకవర్గ అభినందన సభలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు.

రానున్న రోజుల్లో సమీకరణాలు మారతాయని వెల్లడించించారు. ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకుంటాయి. ఏది జరిగినా టీఆర్ఎస్‌కే మంచి జరుగుతుందంటూ.. అనేక అంశాలు చర్చకు వస్తాయని పేర్కొన్నారు. సూచనప్రాయంగా చెప్పిన కవిత అంతకు మించి ఏమీ మాట్లాడనంటూ దాటేశారు.

రాష్ట్రంలో పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అందుబాటులో లైబ్రరీలు ఉంచుతామని హామీ ఇచ్చారు. జగిత్యాలలోని 15 మండలాలలో లైబ్రరీలు ఉండగా.. మరో మూడు మండలాల్లో సైతం ఏర్పాటు చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతన లైబ్రరీకి త్వరలో కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుందని వివరించారు.