మరో 14రోజులు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

మరో 14రోజులు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14రోజులు పొడిగించింది. కస్టడీ పొడిగింపుతో మరో 14రోజులు ఆమె తీహార్ జైలులో ఉండనున్నారు. తదుపరి విచారణ ఏప్రిల్ 23కు కోర్టు వాయిదా వేసింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ అధికారులు కోర్టును కోరారు. కవిత బయటకువస్తే కేసు దర్యాప్తు పై ప్రభావం పడుతుందని, కవిత దర్యాప్తును సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయగలరని ఈడీ తరపు నాయవాదులు కోర్టుకు తెలిపారు.

Also Read : MLC Kavitha : రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

మరోవైపు కవిత తరపున న్యాయవాది నితీష్ రానా వాదనలు వినిపించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని, లిక్కర్ కేసులో ఈడీ కొత్తగా కనుగొన్నది ఏమి లేదని తెలిపారు. 2022 నుంచి లిక్కర్ కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత దర్యాప్తు ను ప్రభావితం చేయదని న్యాయవాది నితీష్ రానా కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది.

Also Read : MLC Kavitha : నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

కోర్టునుంచి బయటకు వెళ్లే సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ కేసు, రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అన్నారు. సీబీఐ ఇప్పటికే నా స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది. నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని కవిత అన్నారు.