MLC Kavitha : నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.

MLC Kavitha : నో బెయిల్.. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట

MLC Kavitha

MLC Kavitha Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈనెల 16వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈనెల 4న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కవితకు మధ్యంతర బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇప్పటికే అప్రూవల్ గా మారిన కొందరిని కవిత బెదిరించారని అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఉదయం కవిత పిటిషన్ తోసిపుచ్చుతున్నట్లు తీర్పును వెలువరించింది. దీంతో కవితకు మధ్యంతర బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు.

Also Read : Delhi Liquor Scam : కవిత కేసులో జరగబోయేది ఇదే..! సీబీఐ విచారణపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని రౌస్ అవెన్యూ కోర్టును కవిత కోరనున్నారు. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు అప్లికేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే, కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటీషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20న విచారణ జరపనుంది. ఈ క్రమంలో రెగ్యూలర్ బెయిల్ కోసం వెయిట్ చేస్తారా? హైకోర్టు ఆశ్రయిస్తారా అనేదికూడా వేచిచూడాల్సి ఉంది. ఇదిలాఉంటే.. కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కవితను కోర్టులో ఈడీ హారుపర్చనుంది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరనుంది. మరికొద్ది రోజులు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : Delhi Liquor Scam : కవిత కేసులో జరగబోయేది ఇదే..! సీబీఐ విచారణపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు