MLC Kavitha : రాహుల్ గాంధీ రాజకుమారుడు .. వారిని కలవటం ఆయనకు కొత్త మాకు కాదు : కవిత

వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ తో  రాహుల్ భేటీ కావటంతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ రాజకుమారుడు కదా..అంటూ వ్యాఖ్యానించారు.

MLC Kavitha : రాహుల్ గాంధీ రాజకుమారుడు .. వారిని కలవటం ఆయనకు కొత్త మాకు కాదు : కవిత

MLC Kavitha..Rahul Gandhi

Updated On : November 28, 2023 / 4:13 PM IST

MLC Kavitha..Rahul Gandhi : తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. సాయంత్రం 5.00లకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు కావటంతో హైదరాబాద్ లో రాహుల్ గాంధీ వివిధ వర్గాలకు చెందిన వర్కర్స్ తో భేటీ అయ్యారు.వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్స్, జీహెచ్ఎంసీ వర్కర్స్,స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ విధానం అదే .. అది మన దేశ సంస్కృతి కాదు : రాహుల్ గాంధీ

వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ తో  రాహుల్ భేటీ కావటంతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత సెటైర్లు వేశారు.రాహుల్ గాంధీ రాజకుమారుడు కదా.. వారితో మాట్లాడటం కొత్త..తమకు అటువంటివి కొత్త కాదు అంటూ చురకలు వేశారు. తాము ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులను కలవటం వారితో మాట్లాడటం..వారి కష్టసుఖాలు తెలుసుకోవం కొత్తేమీ కాదని కానీ రాహుల్ కు కొత్త కాబట్టి నేర్చుకోనివ్వండి అంటూ సెటైరిక్ గా మాట్లాడారు.

Rahul Interaction : చివరి రోజు హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం.. వివిధ వర్గాల వర్కర్స్ తో మాటామంతి

అలాగే ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో అన్ని పార్టీల నేతలు తమకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ తమ నియోజకవర్గాలతో పాటు బ్యాలెన్స్ గా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆఖరి సారి ఓట్ల వేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలోనే ఉన్న కవిత మాట్లాడుతు..ఈసారి సెంచరీ కొడతామనే నమ్మకంతో ఉన్నామని ధీమా వ్యక్తంచేశారు. 100 సీట్లు గెలుస్తామని..ఎందుకుంటే బీఆర్ఎస్ కు ఎక్కడికెళ్లినా మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజల స్పందన బాగుందని.. మంచి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామని భావిస్తున్నామని కవిత తెలిపారు.