Rahul Gandhi : బీజేపీ విధానం అదే .. అది మన దేశ సంస్కృతి కాదు : రాహుల్ గాంధీ

అందరికి ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత జోడో పాదయాత్ర చేశానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ విధానం దేశ సంస్కృతి కాదు అంటూ దుయ్యబట్టారు.

Rahul Gandhi : బీజేపీ విధానం అదే .. అది మన దేశ సంస్కృతి కాదు : రాహుల్ గాంధీ

Rahul Gandhi Road Show at Nampally

Rahul Gandhi Fire on BJP : నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు రాహుల్ బీజేపీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ విధానం విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందటమే అని అది భారత దేశ సంస్కృతి కాదు అంటూ విమర్శించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది అంటూ మండిపడ్డారు. తాను అందరికి ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత జోడో పాదయాత్ర చేశానని ఆ యాత్రలో ఎంతోమందిని కలుసుకున్నానని ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.

బీజేపీ కక్ష పూరితంగా తనపై ఎన్నో కేసులు పెట్టిందని..తన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని..ఎంపీ నివాసనం నుంచి వెళ్లగొట్టిందని అయినా తాను బాధపడలేదన్నారు. కానీ ప్రజల మద్య విద్వేషాలు సృష్టిస్తు బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఇది దేశ సంస్కృతి కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎంతో అవినీతి జరిగిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విమర్శిస్తోంది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోరు..ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేకాబట్టి అని అన్నారు. పైకి మాత్రం విమర్శలు..తెర వెనుక లోపాయికార ఒప్పందాలతో ఈ రెండు పార్టీలు ఉన్నాయని విమర్శించారు.

Also Read :మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు.. అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఈసీ వార్నింగ్

అంతేకాదు బీజీపీ ఎంఐఎం విమర్శలు చేస్తుంది. బీజేపీ కూడా ఎంఐఎంపై విమర్శలు చేస్తుంది. కానీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. ఎంఐఎం ఎక్కడెక్క పోటీ చేయాలో బీజేపీయే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నాలు చేస్తోందని అలాగే ఎంఐఎం కూడా అదే యత్నాలు చేస్తోందన్నారు. కేసీఆర్ అవినీతిపరుడని విమర్శించే బీజేపీ అధికారంలో ఉండి కూడా ఎందుకు ఆయనపై ఒక్క కేసు కూడా పెట్టలేదు..? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని గమనించి ఓటు వేయాలని కోరారు.

బీజేపీ తనను ఎంతగా ఇబ్బందులకు గురిచేసినా..ప్రజల గుండెల్లో తనకు మంచి స్థానాన్ని ఇచ్చారని తనను ప్రేమతో ఆదరించారని అన్నారు.భారత్ జోడో యాత్రలో ఆ ప్రేమను తాను చూశానని..మనసారా ఆస్వాదించానని గుర్తు చేసుకున్నారు. బయట విమర్శించుకున్నా..పార్లమెంట్ లో మాత్రం బీజేపీకి బీఆర్ఎస్ అన్ని విషయాల్లోను సపోర్టు చేస్తుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అంతా దొరలపాలనే అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకొస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ల స్థాయికి పడిపోయింది : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు రాహుల్ గాంధీ, గుడ్ బై చెప్పేందుకు అందరు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలించాలని కోరారు.తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామన్నారు. దాంట్లో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా వంటివి అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేసి గెలిపిస్తే ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని హామీ ఇచ్చారు.