తల్లేనా, బ్లేడ్‌తో కొడుకు తొడలపై దాడి

తల్లేనా, బ్లేడ్‌తో కొడుకు తొడలపై దాడి

Updated On : February 16, 2021 / 11:47 AM IST

mother attack child with blade: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ జెన్యూరామ్ క్వార్టర్స్‌లో దారుణం జరిగింది. ఓ తల్లి పైశాచికత్వం ప్రదర్శించింది. సొంత కొడుక్కుకి నరకం చూపింది. అతడిపై బ్లేడ్‌తో దాడి చేసింది. బాలుడి తొడలపై విచక్షణ రహితంగా దాడి చేసింది. బాలుడి అరుపులతో స్థానికులు అక్కడికి వచ్చారు. వెంటనే వారు బాలుడిని కాపాడారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏ తల్లి అయినా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. తనక ఎంత కష్టమొచ్చినా పిల్లలకు మాత్రం తెలియనివ్వద్దు. కడుపున పుట్టిన వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే అమ్మని దైవంతో సమానంగా చూస్తారు. కానీ, ఆమె మాత్రం కన్నతల్లిలా కాకుండా కసాయిలా వ్యవహరించింది. కన్నకొడుకుపైనే బ్లేడ్ తో దారుణంగా దాడి చేసింది. నొప్పి భరించలేక పిల్లాడు కేకలు పెడుతున్నా.. ఆమె కనికరించలేదు. పిల్లాడికి నరకం చూపెట్టింది. ఈ ఘటన స్థానికులను ఆవేదనకు గురి చేసింది.