Revanth Reddy : తప్పని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా
తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఉన్నందునే దళిత బంధు అమలు చేస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy : తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఉన్నందునే దళిత బంధు అమలు చేస్తున్నారని విమర్శించారు. మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు రేవంత్.
మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు జనం భారీగా కదిలివచ్చారు. మూడుచింతలపల్లి గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాటల తూటాలు కురిపించారు. ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు రేవంత్‌రెడ్డి. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే…ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.