Rajagopal Reddy : మునుగోడులో 2 ఎకరాల్లో కోటి రూపాయలతో ఇల్లు, ఆఫీస్ నిర్మాణం.. విమర్శలకు చెక్ పెట్టే దిశగా రాజగోపాల్ రెడ్డి
ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ది ఒకటైతే, స్థానికంగా ఉండరనే అపవాదు మరొకటి. నియోజకవర్గంలో ఒక్క రాత్రి కూడా నిద్ర చేయని ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని ప్రతర్థులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.

Rajagopal Reddy : ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ది ఒకటైతే, స్థానికంగా ఉండరనే అపవాదు మరొకటి. నియోజకవర్గంలో ఒక్క రాత్రి కూడా నిద్ర చేయని ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని ప్రతర్థులు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆ విమర్శలను తిప్పి కొట్టేందుకు మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. దాదాపు కోటి రూపాయల వ్యయంతో రెండు ఎకరాల స్థలంలో నివాసం, క్యాంప్ కార్యాలయం నిర్మించారు. ఉపఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ క్యాంప్ కార్యాలయం నిర్మించుకున్నారు. ప్రస్తుతం సతీమణితో కలిసి అదే ఇంట్లో ఉన్నారాయన.
నివాసంతో పాటు పార్టీ కార్యకలాపాలు, ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేలా క్యాంప్ ఆఫీస్ ను తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నేతలు బస చేసేందుకు వీలుగా కొన్ని తాత్కాలిక మోడ్రన్ టెంట్లు ఏర్పాటు చేశారు. కేవలం నివాసం కార్యక్రమాలే కాకుండా కార్యకర్తలు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మాణాలు కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినా తట్టుకునేలా షెడ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. అదే విధంగా ప్రచార బాధ్యతల్లో ఉన్న నేతలకు, ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు భోజన సదుపాయం అందించేలా జంబో కిచెన్ నిర్మించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గతంలో ఏనాడు నియోజకవర్గంలో ఉండని రాజగోపాల్ రెడ్డి.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. మునుగోడు నుంచి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రూ.1800 కోట్ల కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయారనే విమర్శతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానికతను టీఆర్ఎస్ పదే పదే ప్రశ్నించింది. ప్రతి సభలోనూ టీఆర్ఎస్ నేతలు.. రాజగోపాల్ రెడ్డి స్థానికుడు కారు, స్థానికంగా ఇల్లూ లేదు, నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా నిద్ర చేయని ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటూ పదే పదే విమర్శలు గుప్పించారు.
ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకే మునుగోడులో భారీ స్థాయిలో క్యాంప్ ఆఫీస్ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణాలన్నీ కేవలం ఉపఎన్నిక కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా పక్కా ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి.