Muslims Protest : హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింల ఆందోళన..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి.

Muslims Protest
Muslims protest : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింల ఆందోళన చేపట్టారు. దేశ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ముస్లింలు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా శుక‍్రవారం ప్రార్థనల తర్వాత ముస్లింలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, యూపీ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.
నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో నమాజ్ తర్వాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చార్మినార్ వద్ద హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.